హాస్పిటల్ మిస్టరీ
రచన - లాస్య రామకృష్ణ
అది ఒక ప్రముఖ హాస్పిటల్. ప్రపంచంలోనే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచే హాస్పిటల్. కానీ ఆ హాస్పిటల్ లో ని వీడని ఒక మిస్టరీ ఉంది.
అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్ధం కావట్లేదు.
ఐ సి యు లో ఉండే ఆ బెడ్ లో అడ్మిట్ అయ్యే ప్రతి పేషెంట్ కరెక్ట్ గా రాబోయే ఆదివారం ఉదయం 11.00 గంటలకల్లా ప్రాణాలు విడిచేవారు. అసలేం జరుగుతోందో ఎవరికీ అంతుబట్టడం లేదు.
ఆ హాస్పిటల్ లోని డాక్టర్స్ అందరిలోనూ ఒక అలజడి. ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే తాపత్రయం. సమస్య పరిష్కరించాలనే తపన. ఏవైనా మానవాతీత శక్తులు తిరుగుతున్నాయా అని అనుమానం. భయం. బెంగ...
అడ్మిట్ అయ్యే వారు ప్రత్యేకించి ఆ బెడ్ ని తప్ప వేరే బెడ్ ని కోరేవారు.
క్రమంగా హాస్పిటల్ కి జనాలు తగ్గుముఖం పట్టారు. ఇప్పటికైనా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని డాక్టర్స్ టీం అంతా డిసైడ్ అయ్యారు.
ఒక ఆదివారం ఉదయం, 11:00 గంటలకి సరిగ్గా పది నిమిషాల ముందు డాక్టర్స్ అందరూ ICU బయట దాక్కుని ఈ మిస్టరీ వెనుక హిస్టరీ తెలుసుకుందామని ఎదురుచూస్తున్నారు. సమయం చక చకా పరిగెడుతోంది.
కొందరు డాక్టర్స్ దేవుడి పుస్తకాలు కుడా తెచ్చుకున్నారు.
సమయం
10:57
అందరికి ముచ్చెమటలు పడుతున్నాయి
10:58
దేవుడి ప్రార్ధనలు ఎక్కువవుతున్నాయి
10:59
గుండె దడ మరీ ఎక్కువైంది
10:59:58
ఇంకొద్ది క్షణాల్లో ఏం జరగబోతోందో ......
11:00
హాస్పిటల్ పనివాడు వచ్చి I C U లో ఉన్న లైఫ్ సపోర్ట్ సిస్టం(Life Support System) ప్లగ్ తిసేసాడు ఎందుకంటే వ్యాక్యూం క్లీనర్ (Vaccum cleaner) వాడుకోవడానికి.

పనిచేసేవాడికి పనిచేయవలసిన విధానం తెలియకుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా నష్టపోతారో తెలియచేస్తున్నదీ కధ . అదే సమయంలో పనివాళ్ళకు పని చెప్ప్పటమే కాదు , చేయించటమే కాదు పర్యవేక్షణ ఎంత అత్యవసరమో స్పష్టంగా తెలియచేస్తున్నది .
ReplyDeleteయంత్రాంగంలో చిన్న మర సరిగా లేకపోయినా ఎంత అనర్థం జరుగుతుందో చక్కగా చెప్పారు.
ReplyDelete